వావిలాల గోపాలకృష్ణయ్య వర్ధంతి

2110చూసినవారు
వావిలాల గోపాలకృష్ణయ్య వర్ధంతి
గంపలగూడెం మండలం పెనుగొలనులో బుధవారం స్వతంత్య్ర సమరయోధులు వావిలాల గోపాలకృష్ణయ్య వర్ధంతిని శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య, విశాలాంధ్ర, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర, మద్యపాన నిషేధం, గ్రంథాలయ ఉద్యమాల్లో పాల్గొని ఎందరికో ఆదర్శంగా నిలిచిన వావిలాల, నాలుగు సార్లు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించి, నాగార్జునసాగర్ ప్రాజెక్టు కోసం చేసిన కృషి మరవలేనిదని టీచర్ కే. లింగమ్మ తెలిపారు.

సంబంధిత పోస్ట్