
MS ధోనికీ రూ.1000 జరిమానా విధించిన పోలీసులు
రాంచీలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీకి పోలీసులు రూ. 1,000 జరిమానా విధించారు. రాంచీలోని తన నివాసం సమీపంలో ధోనీ ప్రయాణిస్తున్న వాహనం అతివేగంగా వెళ్లినట్లు ఆటోమేటెడ్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ గుర్తించింది. మోటారు వాహనాల చట్టం సెక్షన్ 183 ప్రకారం ట్రాఫిక్ పోలీసులు ధోనీ పేరు మీద ఈ-చలాన్ జారీ చేశారు. ధోనీ ప్రస్తుతం IPL 2026 సీజన్ కోసం సన్నద్ధమవుతున్నారు.




