గంపలగూడెం మండలం పెనుగొలనులో శనివారం ప్రజా గాయకుడు గద్దర్ జయంతి వేడుకలు శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద, మధ్యతరగతి ప్రజల కష్టాలను పాటల ద్వారా చైతన్యపరిచిన గద్దర్, "నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ" అనే సినిమా పాటతో విశేష ప్రజాదరణ పొందారని పలువురు తెలిపారు.