గంపలగూడెం మండలంలోని సత్యాలపాడులో శుక్రవారం రాత్రి సుమారు 15 కుటుంబాలు టీడీపీని వీడి వైసిపిలో చేరాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్, గ్రామ సర్పంచ్ వెన్నపూస గోవర్ధన రెడ్డి వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.