
నూతన సంవత్సర వేడుకల్లో విషాదం.. 15 మందికి అస్వస్థత, ఒకరు మృతి
TG: హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని భవానినగర్‌లో నూతన సంవత్సర వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. మద్యం సేవించి, బిర్యాని తిన్న 17 మందిలో 15 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.




