గంపలగూడెం: దేవుడి పేరుతో ఇసుక దందా..!

2210చూసినవారు
గంపలగూడెం: దేవుడి పేరుతో ఇసుక దందా..!
గంపలగూడెం మండలం కట్లేరు వాగు పరివాహక ప్రాంతంలో ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొత్తపల్లి శ్రీ ఉమా గౌరీ శంకర దేవాలయానికి ఆనుకుని ఉన్న కట్లేరు వాగులో ఇసుక అక్రమ రవాణా బాహాటంగా జరుగుతోందని, ఆలయ అభివృద్ధి పేరు చెప్పి కొందరు నాయకులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని అంటున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడి నుంచి తెలంగాణకు ఇసుక తరలిపోతున్నా అధికారుల చర్యలు శూన్యంగా ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్