గంపలగూడెం మండలం పెనుగొలనులో శుక్రవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య పోరాటంలో అహింసా మార్గాన్ని అనుసరించి, ఆచరించి చూపిన గాంధీజీ మార్గం అందరికీ ఆదర్శమని సాయిబాబా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ కే. లింగమ్మ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు.