నెమలి వేణుగోపాల స్వామి దేవాలయంలో గీతా జయంతి వేడుకలు

7చూసినవారు
తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాల స్వామి దేవాలయంలో సోమవారం గీతా జయంతి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్త బృందం సభ్యులు భగవద్గీత పారాయణం చేశారు. ఆలయ ప్రధానఅర్చకులు గోపాలచార్యులు స్వామివారికి, అమ్మ వార్లకు అలంకరణ చేసి తులసి దళాలు, వివిధ పూలతో అష్టోత్తర శతనామావళి పూజ చేశారు. అనంతరం గీతా జయంతి విశిష్టతను వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్