గీతా జయంతి ఉత్సవాలు వైభవంగా ముగింపు

4చూసినవారు
తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను శిరిడి సాయిబాబా మందిరంలో మూడు రోజుల పాటు జరిగిన గీతా జయంతి ఉత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా సాయిబాబా వెండి విగ్రహానికి భక్తులు పూలాభిషేకం, అన్నాభిషేకం చేశారు. ఆలయ అర్చకులు దాములూరు సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో సాయిబాబా, ఆంజనేయస్వామికి అష్టోత్తర శతనామావళి పూజ జరిగింది. భక్త బృందం నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణం, భజన కార్యక్రమాల్లో హనుమాన్ మాలాదారులు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :