పెనుగొలనులో గీతా జయంతి ఉత్సవాలు, విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ

0చూసినవారు
తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలనులో శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో గీతా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా, మెయిన్ ప్రాథమిక పాఠశాలలో 4, 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సాయిబాబా కమిటీ సభ్యులు నోటు పుస్తకాలు, టవల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో విశ్రాంత ఎంఈఓ.వి.శేషి రెడ్డి విద్యార్థులకు గురువు చెప్పిన పాఠాలను చక్కగా చదువుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యోహాన్, సాయిబాబా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు, విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సోమవారం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్