కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి గంపలగూడెం మండలం పెనుగొలను బోటిమీద శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్త బృందం సభ్యులు భజన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయ ప్రాంగణంలో ఓం సింబల్ ఆకారంలో దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారికి వివిధ పదార్థాలు నివేదించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.