
మహేశ్- రాజమౌళి మూవీ ఈవెంట్.. స్పెషల్ వీడియోతో కార్తికేయ క్లారిటీ
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న #SSMB29 చిత్ర వేడుకకు సంబంధించిన వివరాలను రాజమౌళి తనయుడు కార్తికేయ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 15న రామోజీ ఫిల్మ్ సిటీలో ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఈవెంట్ ఓటీటీ 'జియో హాట్‌స్టార్'లో స్ట్రీమింగ్ కానుంది. కార్తికేయ జియో హాట్‌స్టార్ ఖాతాను ట్యాగ్ చేయడంతో ఈ విషయంపై స్పష్టత వచ్చింది. జియోహాట్ స్టార్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ వేడుకలోనే సినిమా టైటిల్‌ను ప్రకటించే అవకాశాలున్నాయి.




