సాహితీవేత్త దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి ఘనంగా నిర్వహణ

12చూసినవారు
గంపలగూడెం మండలం పెనుగొలనులో బుధవారం ప్రముఖ సాహితీవేత్త దాశరథి కృష్ణమాచార్య వర్ధంతిని షిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దాశరథి ప్రజలను చైతన్యపరిచేందుకు నిజాం పాలనకు వ్యతిరేకంగా అనేక రచనలు చేశారని, వేదాలను తెలుగులో అనువదించారని ఈ సందర్భంగా తెలిపారు.