తిరువూరు కుమ్మరిబజార్లోని కాజా శ్రీహరిరావు ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఆయన భార్య వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లిన సమయంలో బీరువాలోని 20 గ్రాముల బంగారం, కేజిన్నర వెండి, రూ. 10 వేల నగదు, బుల్లెట్ బైక్ను దొంగలు అపహరించారు. ఆధారాలు దొరకకుండా సీసీటీవీ ఫుటేజ్, హార్డ్వేరును కూడా ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ ప్రసాదరావు, సీఐ గిరిబాబు పరిశీలించి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.