గంపలగూడెం మండలం మేడూరు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో హరే రామ సప్తాహ మహోత్సవాలలో భాగంగా బుధవారం సామూహిక హనుమత్ వ్రతాలు వైభవంగా జరిగాయి. మార్గశిరా మాసము శుద్ధ త్రయోదశి రోజు హనుమంతుని పూజించిన వారికి సకల కోరికలు నెరవేరి దుఃఖాలు తొలగిపోతాయని వేద పండితులు తెలిపారు. ఆలయ అర్చకులు స్వామి మూల విరాట్ విగ్రహానికి సింధూరం, తమలపాకులు, పూలతో అష్టోత్తర శతనామావళి పూజ చేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది.