
కుటుంబం ఆత్మహత్యాయత్నం.. తల్లి, కుమార్తె మృతి
కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గూళ్యంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తల్లి, కుమార్తె మృతి చెందారు. తండ్రి మహేష్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబం ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.




