గంపలగూడెం మండలం పెనుగొలనులో ఆదివారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత, నాటక కర్త పానుగంటి లక్ష్మీ నరసింహారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన అమూల్య సేవలను గుర్తుచేసుకున్నారు. సాయిబాబా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ, పానుగంటి ఆంధ్ర షేక్ స్పియర్, కవి శేఖరుడు, అభినవ కాళిదాసు బిరుదులు పొందారని తెలిపారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచిపెట్టారు.