యాక్టివ్ పాలిటిక్స్‌పై పేర్ని నాని క్లారిటీ

812చూసినవారు
యాక్టివ్ పాలిటిక్స్‌పై పేర్ని నాని క్లారిటీ
యాక్టివ్ రాజకీయాలపై మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని స్పష్టత ఇచ్చారు. రాజకీయాలకు వీడ్కోలు పలికిన తన నిర్ణయానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని, 2029 ఎన్నికల్లో కూడా పోటీ చేసే ఆలోచన లేదని ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 2024 ఎన్నికల తర్వాత జగన్ ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లోనే తాను రాజకీయంగా చురుగ్గా మారినట్లు వివరించారు. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి తిరిగి రావాలనే ఉద్దేశం కాకుండా, రాముడికి ఉడత చేసిన సాయంలా జగన్‌కు తోడుగా నిలవాలనే భావనతోనే ముందుకు వచ్చానన్నారు. పార్టీకి అవసరమైనప్పుడు అండగా ఉంటానని, కానీ ఎన్నికల బరిలో దిగే ప్రశ్న లేదని పేర్ని నాని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్