
ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా భారీ నిరసనలు
అమెరికా, ఐరోపా నగరాల్లో 'నో కింగ్స్' పేరుతో లక్షలాది మంది ప్రజలు శనివారం భారీ ర్యాలీలు నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు రాజకీయాలు, ఇరాన్‌పై యుద్ధం, కఠిన వలస విధానాలకు వ్యతిరేకంగా ఈ ర్యాలీలు చేపట్టారు. దాదాపు 90 లక్షల మంది ప్రజలు పాల్గొన్నఈ నిరసనలకు అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రం కేంద్రబిందువుగా నిలిచింది. రాక్ స్టార్ బ్రూస్ స్ప్రింగ్ స్టీన్ కూడా పాల్గొని, 'నిరంకుశత్వానికి అమెరికా గడ్డపై చోటు లేదు' అని వ్యాఖ్యానించారు. లండన్, పారిస్, రోమ్ వంటి నగరాల్లోనూ వేలాది మంది నిరసన తెలిపారు.




