తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె. మాధురి శుక్రవారం గంపలగూడెం మండలంలో విస్తృత పర్యటన చేశారు. పెద్దకోమిర గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి, వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలును పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా పరిస్థితులు, వసతులపై ఆరా తీశారు. పల్లె పండుగ 2.0 కింద పెద్దకోమిరలో గృహ స్థలాల పంపిణీ పనులను, మేడూరులో ఉగాది లక్ష్యాల కింద గృహ స్థలాల పనులను తనిఖీ చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.