తిరువూరు ఆర్డీవో కె. మాధురి గంపలగూడెం మండలంలో విస్తృతంగా పర్యటించారు. పెద్దకోమిరలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి, 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలును పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా పరిస్థితులు, వసతుల గురించి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో తహసీల్దార్, ఎంఈఓ కూడా పాల్గొన్నారు. అనంతరం, పల్లె పండుగ 2.0 కింద పెద్దకోమిరలో గృహ స్థలాల పంపిణీ పనులను కూడా ఆమె పరిశీలించారు.