అంగన్వాడిలో సంక్రాంతి సంబరాలు: భోగి పండ్లు పోసి ఆశీర్వదించిన మహిళా కమిటీ

7చూసినవారు
గంపలగూడెం మండలం పెనుగొలను అంగన్వాడిలో శనివారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ కే. లింగమ్మ పండుగ ప్రాముఖ్యతను వివరించారు. మహిళా కమిటీ సభ్యులు చిన్నారులకు, విద్యార్థులకు రేగి పండ్లు, మంచి శనగలు, పూలు, రూపాయి నాణెలు కలిపిన భోగి పండ్లను తలపై పోసి ఆశీర్వదించారు. రంగురంగుల ముగ్గులు వేసి, భోగి మంటలు వేశారు. సాయిబాబా కమిటీ సభ్యులు మిఠాయిలు పంచిపెట్టారు.

సంబంధిత పోస్ట్