గంపలగూడెం మండలం ఊటుకూరులో గురువారం సీపీఐ సీనియర్ నాయకుడు అనంత లక్ష్మయ్య సంస్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంత లక్ష్మయ్య సీపీఐ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారని, పేద ప్రజలకు సేవ చేయడంలో ముందుండేవారని పలువురు నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తూము కృష్ణయ్య, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.