గంపలగూడెం మండలం పెనుగొలనులో మంగళవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ గణిత శాస్త్రవేత్త శకుంతలా దేవి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక గణిత ప్రదర్శనలు నిర్వహించి, అతి వేగంగా గణనలు చేయడంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు పొందిన శకుంతలా దేవి స్మృతికి సాయిబాబా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి. నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.