షేక్ నాజర్ జయంతి: బుర్రకథకు కొత్త జీవం పోసిన మహానాయకుడికి నివాళి

5చూసినవారు
గంపలగూడెం మండలం పెనుగొలనులో గురువారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో బుర్రకథ పితామహుడు పద్మశ్రీ షేక్ నాజర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. "వినరా భారత వీర కుమారా విజయం మనదేరా" అంటూ ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథకు కొత్త జీవం పోసి, మెరుగులు దిద్ది, ప్రత్యేక శైలిలో తగిన హావభావాలతో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ప్రజలను చైతన్య పరిచారని సాయిబాబా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు తెలిపారు.

ట్యాగ్స్ :