సోమవారం గంపలగూడెం మండలం మేడూరులోని 1116 శివలింగాల ఆలయంలో అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వివిధ స్వాముల మాలదారులకు, భక్తులకు అన్నదానం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ అప్పారావు, సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమం తిరువూరు నియోజకవర్గంలో జరిగింది.