గంపలగూడెం మండలం మేడూరు వీరాంజనేయ స్వామి ఆలయంలో కార్తీక ఏకాదశి సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి మంత్రపూర్వకంగా అభిషేకం చేసి తమలపాకులు, సింధూరం, పూలతో అష్టోత్తర శతనామావళి పూజ చేశారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.