పెనుగొలనులో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం వైభవంగా

0చూసినవారు
పెనుగొలనులో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం వైభవంగా
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు మండలం పెనుగొలనులోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం స్వామివారి వార్షిక కళ్యాణం వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు భరద్వాజ్ ఆధ్వర్యంలో శ్రీ రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత నరసింహస్వామి కళ్యాణం శాస్త్రోక్తంగా, మంగళ వాయిద్యాలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్