తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం పెనుగొలనులో శుక్రవారం రాత్రి అయ్యప్ప స్వామి పడి భజన, పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది. గుంత గంతవెంకటేశ్వర్లు, బాలకృష్ణ గురు స్వాములు శ్రీ గణపతి, సుబ్రహ్మణ్యం, అయ్యప్ప స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండా స్వామి భక్త బృందం పాడిన భక్తి పాటలు ఆకట్టుకున్నాయి. తోట రామకృష్ణ స్వామి ఏర్పాట్లను పర్యవేక్షించారు.