పెంచిన టెట్ ఫీజు తగ్గించాలి: జిల్లా అధ్యక్షుడు శివ

0చూసినవారు
పెంచిన టెట్ ఫీజు తగ్గించాలి: జిల్లా అధ్యక్షుడు శివ
విస్సన్నపేట: రాష్ట్రంలో టెట్ పరీక్ష ఫీజును వెయ్యి రూపాయలుగా నిర్ణయించడం లక్షలాది మంది ప్రైవేట్ టీచర్లకు అదనపు భారమని, దీనిని తగ్గించాలని ఎన్టీఆర్ జిల్లా ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బొట్ల శివ సత్యనారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు టెట్ కన్వీనర్ కృష్ణారెడ్డికి వినతి పత్రం పంపినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఈ విషయంపై స్పందించి పరీక్ష ఫీజును యధాతథంగా ఉంచాలని కోరుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్