జనవరి 3వ తేదీన వాహినీ ఇంజినీరింగ్ కళాశాలలో జరగనున్న నియోజకవర్గ స్థాయి తిరువూరు బాలోత్సవం 4వ పిల్లల పండుగ గోడపత్రికను మంగళవారం తిరువూరు డివిజన్ ఆర్. డి. ఓ మాధురి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనలను పెంపొందించడానికి, వారి అభిరుచులను, ఆసక్తులను ప్రోత్సహించడానికి బాలోత్సవాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఈ పిల్లల పండుగ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.