టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)తో వివాదం నేపథ్యంలో పార్టీ ఆదేశాల మేరకు ఆయన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, క్రమశిక్షణ కమిటీ సభ్యులు కొనకళ్ల నారాయణరావు, వర్ల రామయ్య, ఎంఏ షరీఫ్, పంచుమర్తి అనురాధ సమక్షంలో కొలికపూడి శ్రీనివాసరావు తన వాదనలు వినిపించారు.