తిరువూరులో ఫుట్ పాత్ ఆక్రమణల వల్ల ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మున్సిపల్ అధికారులు తెలిపారు. గురువారం పోలీసుల సహాయంతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, బోసుబొమ్మ సెంటర్ నుంచి చీరాల సెంటర్ వరకు ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తామని ఎస్సై శాతకర్ణి, టౌన్ ప్లానింగ్ అధికారి నాగమల్లేశ్వరావు పేర్కొన్నారు.