తిరువూరు నియోజకవర్గంలో మంగళవారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. తిరువూరు బస్ స్టేషన్లోకి వరద నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి బస్ స్టేషన్లో నిలిచిన నీటిని బయటకు తోడాలని ప్రయాణికులు కోరుతున్నారు.