తిరువూరు ఆర్టీసీ బస్టాండ్ ఔట్ గేట్ వద్ద బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు తెలుపు చొక్కా, బ్లూ గీతల లుంగీ ధరించి ఉన్నాడు. అతని జుట్టు ఎరుపు-నలుపు రంగులో ఉంది. వడదెబ్బతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు తిరువూరు పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ శాతకర్ణి కోరారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.