యూరియా పంపిణీ పారదర్శకంగా జరగాలి: తిరువూరు ఆర్డీవో

1చూసినవారు
యూరియా పంపిణీ పారదర్శకంగా జరగాలి: తిరువూరు ఆర్డీవో
తిరువూరు ఆర్డీవో కార్యాలయంలో యూరియా ఎరువుల పంపిణీని సక్రమంగా నిర్వహించడంపై సమీక్ష సమావేశం జరిగింది. ఆర్డీవో సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో, యూరియా పంపిణీ పూర్తిగా పారదర్శకంగా, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జరగాలని సూచించారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ ఏడీ, తహశీల్దార్లు, ఎంఏవోలు, తిరువూరు డివిజన్ పరిధిలోని పీఏసీఎస్ ప్రతినిధులు, ప్రైవేట్ ఎరువుల దుకాణాల నిర్వాహకులు పాల్గొన్నారు. ఎరువుల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్