తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం, పెనుగొలనులోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు గురువారం వైభవంగా ముగిశాయి. ఆలయ అర్చకులు స్వామివారికి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్త బృందం సభ్యులు దీపోత్సవం, భజన కార్యక్రమాలను చేపట్టారు. ఆలయ కమిటీ కన్వీనర్ పరుచూరు హరిమాధగుప్త ఏర్పాట్లను పర్యవేక్షించారు.