విస్సన్నపేట మండలం పుట్రేల, కోటిపల్లి గ్రామాల్లో పేకాట శిబిరాలపై పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఒక మామిడి తోటలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారనే సమాచారంతో ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుండి ₹2830 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.