విస్సన్నపేట తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో తిరువూరు ఆర్డీవో ఏ. కుమార్ పాల్గొన్నారు. ప్రతి సోమవారం ఒక్కో మండలంలో ఈ ప్రత్యేక పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల నుంచి ఆర్డీవో నేరుగా అర్జీలను స్వీకరించి, వాటిని త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చిన్న రాట్నాలు, ఎమ్మార్వో లక్ష్మీ కళ్యాణి, తదితరులు పాల్గొన్నారు.