ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా, తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రి ఐసీటీసీ విభాగం ఆధ్వర్యంలో సోమవారం విస్తృత అవగాహన ర్యాలీ నిర్వహించారు. బోసుబొమ్మ సెంటర్ కూడలిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆసుపత్రి చైర్మన్ ఆకుల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, ఎయిడ్స్ వంటి మహమ్మారిని నిర్మూలించడానికి గ్రామ, పట్టణ స్థాయిల్లో నిరంతర అవగాహన కార్యక్రమాలు అవసరమని తెలిపారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. భాను తేజ, HIV కౌన్సిలర్ KLP Ch. ప్రసాద్, ల్యాబ్ టెక్నీషియన్ వెంకటరావు, రాజవర్ధన్ పారా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సుబ్బారావు, లింక్ వర్కర్స్ NGO ప్రతినిధి జి. సరిత, కాలేజీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.