
విజయవాడ: నిలిపి ఉంచిన పాత కారులో మృతదేహం కలకలం
విజయవాడ గుణదల రామవరప్పాడు రింగ్ సమీపంలో నిలిపి ఉంచిన పాత కారులో ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రోడ్డు పక్కన చాలా కాలంగా ఉన్న కారు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గుణదల పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.




































