విజయవాడలో ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

0చూసినవారు
విజయవాడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రామలింగేశ్వర నగర్ నుంచి మహానాడు వైపు వస్తున్న బైక్ ఫ్లైఓవర్‌పై అదుపుతప్పి కింద పడింది. ఈ దుర్ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్