ఉంగుటూరు మండలం పొట్టిపాడు శ్మశానం వద్ద ఎన్‌హెచ్ సర్వీస్ రోడ్డు పక్కన డ్రైనేజీలో గుర్తుతెలియని మహిళ మృతదేహం ఆదివారం లభించింది. గ్రామస్థుల సమాచారం మేరకు వీఆర్వో రామారావు ఫిర్యాదు చేయగా, ఆత్కూరు ఎస్‌ఐ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతురాలు యాచకురాలని, ఎండల తీవ్రత కారణంగా మృతి చెంది ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.