మత్స్యకారులకు 50 ఏళ్లకే పింఛన్ ప్రకటించిన ఘనత చంద్రబాబుదేనని మంత్రి కొల్లు రవీంద్ర కొనియాడారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఆఫ్కాఫ్ (AFCOF) ఛైర్మన్, పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మత్స్యకార వర్గాలకు తొలిసారిగా డీజిల్ సబ్సిడీ, వేట నిషేధ భృతి అందించిన చరిత్ర తెలుగుదేశం పార్టీదేనని స్పష్టం చేశారు.