ఇంద్రకీలాద్రిపై లేడీస్ టాయిలెట్‌లో వీడియో తీయాలని చూశాడు..!

35చూసినవారు
ఇంద్రకీలాద్రిపై లేడీస్ టాయిలెట్‌లో వీడియో తీయాలని చూశాడు..!
విజయవాడ ఇంద్రకీలాద్రిలో మంగళవారం ఒక అసభ్యకర ఘటన చోటుచేసుకుంది. మహామండపం 6వ అంతస్తులోని మహిళల బాత్రూమ్‌లోకి నరేశ్ (20) అనే వ్యక్తి చొరబడి, మహిళల వీడియోలు తీయడానికి ప్రయత్నించాడు. గమనించిన మహిళలు అతన్ని పట్టుకుని కొట్టారు. వారి కేకలతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది నరేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ గుణరామ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్