వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటిస్తున్నారు. ఆయనను చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. పూల వర్షంతో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా జగన్ పలువురు చిన్నారులను ఎత్తుకుని, ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దుపెట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.