మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రంగా మండిపడ్డారు. విజయవాడలో మాట్లాడుతూ, వ్యవసాయం గురించి జగన్కు ఏమీ తెలియదని, ఆయన వ్యాపారం దగాతో కూడుకున్నదని ఆరోపించారు. జగన్కు స్క్రిప్ట్ ఇచ్చేవారెవరో, చదివి చెప్పడం కూడా చేతకావడం లేదని విమర్శించారు. రైతులపై దండయాత్రకు వెళ్లారని, ఓడించారనే అక్కసుతో హేళనగా చూసేందుకు వెళ్లారని ఫైరయ్యారు.