పెదపారుపూడి మండలం మోపర్రులో జడ్పీ రహదారి అధ్వానంగా మారింది. కొద్దిపాటి వర్షానికే రోడ్డుపై గుంతలు నీటితో నిండి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దోసపాడు రైల్వే గేట్ నుంచి జనార్ధనపురం సత్రం వరకు రోడ్డు పూర్తిగా పాడైపోయిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఏళ్ల తరబడి సమస్య ఉన్నా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని, కొత్త రోడ్డు వేయాలని వారు కోరుతున్నారు.