NTR: ఆన్‌లైన్‌లో వల.. రూ.కోట్లలో స్వాహా

32చూసినవారు
NTR: ఆన్‌లైన్‌లో వల.. రూ.కోట్లలో స్వాహా
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి యువతులను మోసం చేస్తున్న ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన ఒక మోసగాడిని VJA పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగిగా చెప్పుకుంటూ, డబ్బులు కాజేయడమే ఇతని లక్ష్యం. సైబరాబాద్ యువతి వద్ద రూ.11 లక్షలు, ప్రకాశం జిల్లాలో రూ.44 లక్షలు, నెల్లూరులో రూ.8 లక్షలు, బెంగళూరుకు చెందిన యువతుల నుంచి సుమారు రూ.11 లక్షలు, ఇలా అనేక మంది నుంచి రూ.2.5 కోట్ల పైగా కాజేసినట్లు సమాచారం. ఒక యువతి ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్