విజయవాడ అజిత్ సింగ్ నగర్ పరిసరాల్లో సోమవారం ఉదయం 8 నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. లూనా సెంటర్ పరిధిలోని 11 కేవీ లైన్ లో అత్యవసర మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో ఈ అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు డీఈ కొండలరావు తెలిపారు. యార్డ్ రోడ్, మెయిన్ రోడ్, ఎం. కె. బేగ్ స్కూల్ తదితర ప్రాంతాల వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.